ETV Bharat / state

ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న 'ఆర్ట్స్‌' స్వచ్ఛంద సంస్థ

సామాజిక చీకట్లలో ఉన్నవారికి వెలుగును చూపించారు. అక్షరాస్యత అర్థమే తెలియనివారికి దాని రుచి చూపించారు. కట్టెలు కొట్టుకోవడం తప్ప మరొక పని తెలియని వారికి.... బతుకుదెరువు చూపించారు. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న 'ఆర్ట్స్‌' స్వచ్ఛంద సంస్థపై ప్రత్యేక కథనం.

arts-ngo-working-for-tribal-development
ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న 'ఆర్ట్స్‌' స్వచ్ఛంద సంస్థ
author img

By

Published : Oct 24, 2020, 1:38 PM IST

ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న 'ఆర్ట్స్‌' స్వచ్ఛంద సంస్థ

నాగరికతకు దూరంగా ఉండే ఆదివాసీలను చైతన్యం చేసే లక్ష్యంతో.... శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట కేంద్రంగా 1989లో 'యాక్షన్‌ ఇన్‌ రూరల్ టెక్నాలజీ అండ్‌ సర్వీస్' పేరిట ఆర్ట్స్‌ సంస్థ ఏర్పాటైంది. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు మండలాల్లో సేవలదించిన సంస్థ... విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు విస్తరించింది. అక్కడి గిరిజనానికి చదువు విలువ నేర్పింది. ఆదివాసీలకు భూమి, అడవి హక్కులు లభించేలా కృషి చేసింది.

పట్టాలు ఇప్పించి.... సాగు వైపు నడిపించి

ఆదివాసీలకు భూమి, అటవీ హక్కులు లభించేలా ఆర్ట్స్‌ సంస్థ కృషి చేసింది. హక్కులు, చట్టాలపై యువతకు అవగాహన కల్పించింది. నాబార్డు సాయంతో 28 గ్రామాల్లో రైతుసంఘాలు ఏర్పాటు చేసి... వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 'ఆర్ట్స్' సంస్థ తోడ్పాటుతో గూడేల్లో వసతులు సమకూరాయని, బంజరు భూముల్ని సాగు భూములుగా మార్చి... ఉపాధి పొందుతున్నామని గిరిజనులు సంతోషంగా చెబుతున్నారు.

ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు

కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 325మంది ఒంటరి మహిళలకు... స్వయం ఉపాధి మార్గాలపై ఆర్ట్స్‌ సంస్థ శిక్షణ ఇప్పించింది. అలాగే 'ఎయిడ్ ఎట్ యాక్షన్' సహకారంతో 80 పాఠశాల్లో విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేలా సాగిస్తున్న కృషి సంతృప్తినిస్తోందని... ఆర్ట్స్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా గిరిజన ప్రాంతాల్లో ఆర్ట్స్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా... 2012లో జాతీయ యువజన అవార్డు, 2016లో జిందాల్ సంస్థ పురస్కారం వరించాయి.

ఇదీ చదవండి:
కోనాంలో అబ్బురపరుస్తున్న అందాల జలపాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.