ఇక్కడి పిల్లలకు దసరా పండుగ అంటే చాలు బాణాలు గుర్తుకు వస్తాయి. బాణాలంటే వారికి భలే సరదా. రాబోయే తరాలకు తమ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేందుకు ప్రతి ఏటా విజయనగరం జిల్లా గరివిడి మండలం చుక్కవలస గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ బాణాల పండగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు.
దసరా నవరాత్రుల్లో భాగంగా పాఠశాలలో బాణాల పండుగ నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవిని పూజించి... విద్యార్థినీవిద్యార్థులందరూ బాణాలతో గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ నినాదాలు చేశారు. పిల్లలు తమ చక్కని స్వరాలతో పాటలు పాడి గ్రామస్థులను ఆనందపరిచారు. వారిని చూసిన పెద్దలందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చదవండి :