విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తపాలా కార్యాలయం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్రాల్లో ఆధార్ సెంటర్లలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు చంటిపిల్లలను ఎత్తుకుని అర్థరాత్రి సమయంలో ఆధార్ సెంటర్ల వద్దకు రావల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు పట్టణంలో మొత్తంగా 2 ఆధార్ సెంటర్లు మాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. పాచిపెంట, సాలూరు మండల ప్రాంతాల్లోని వారికి ఆధార్ కావలంటే కొండలపైనుంచి సాలూరుకు రావల్సి వస్తోందన్నారు. తమకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.
ఇది చూడండి: సాలూరులో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన