ETV Bharat / state

పులుల సంచారం - భయాందోళనలో ప్రజలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పులుల సంచారం - భయాందోళనలో ప్రజలు - అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు

tiger_roaming_in_ap
tiger_roaming_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

Tiger Roaming in Srikakulam District: తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జనాలపై పులులు దాడులు ఎక్కువయ్యాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. అదేవిధంగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలే రాష్ట్రంలోనూ అక్కడక్కడ జరిగాయి.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తీమర గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామ శివారులో ఒక ఆవును పులి చంపింది. ఈ విషయాన్ని స్థానిక రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాతపట్నం రేంజ్ అధికారి అమ్మన్న నాయుడు, సెక్షన్ ఆఫీసర్ యశస్వితో పాటు సిబ్బంది గ్రామాన్ని సందర్శించారు. రెండు రోజుల క్రితం పులి ఆవును చంపిన ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. పాతపట్నం మండలంతో పాటు సమీప ఒడిశా ప్రాంతానికి వెలుపల ఈ పులి సంచరిస్తుందని అధికారులు అంచనా వేశారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మేకలపై చిరుత దాడి: అల్లూరి జిల్లా రాజవొమ్మంగి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దోనెలపాలెం-గొబ్బిలమడుగు మార్గంలో చిరుత సంచరిస్తోందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న మేకలపై చిరుత దాడి చేసిందన్న సమాచారంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. నిన్న కొంతమందికి పులి కనిపించినట్లు గిరిజన వాసులు చెబుతున్నారు. పులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Tiger Cub In Kadapa District: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని చేలల్లో పులి పిల్ల సంచరిస్తూ ఓ రైతుకు కంటబడింది. అంతే కాకుండా మడుగు చేను దగ్గర సైతం పులి పిల్ల కనిపించినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గ్రామస్థులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి పిల్ల సంచరిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లింగాల మండలం ఎంఆర్వో గ్రామస్థులను హెచ్చరించారు.

"అదిగో పెద్దపులి.. ఇదిగో చిరుత" - మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన

పులి దాడిలో యువతి మృతి - రూ.10 లక్షలు పరిహారం ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.