విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కొండ కోనేరు గ్రామంలో చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలో 2 రోజుల క్రితం కోనేరుకు చెందిన చిన్న పాప చనిపోయింది. కొండబర్రి సింగన్న అనే వ్యక్తి చేతబడి చేశాడని ఆరోపిస్తూ.. అతనిపై పాప కుటుంబీకులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సింగన్న.. చికిత్స పొందుతూ కూనేరు రామభద్రపురం ఆసుపత్రిలో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: