విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువఝాము నుంచే బారులు తీరారు. ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కొండచుట్టూ 5 కిలోమీటర్లు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తుల రామ నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. కళాకారులు ప్రదర్శించిన కోలాటం, భక్తి గీతాలాపన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి: