వైద్య వృత్తిలో ఉన్న చాలామంది సంపాదనే లక్ష్యంగా పని చేస్తారన్న అపోహ ప్రజల్లో ఉంది. అయితే.. అందరూ అలా కాదని తామూ ఆదర్శవంతమైన సేవలు చేయగలమని విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు నిరూపిస్తున్నారు. 1961లో శ్రీకాకుళం పెద్దాసుపత్రిలో వైద్యునిగా సేవలు ప్రారంభించిన ఆయన.. జిల్లాలోని సోంపేట, ఇచ్ఛాపురం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో పని చేశారు. ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పదేళ్లు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే.. డీఎం అండ్ హెచ్వోగా పదోన్నతి వచ్చినా.. వైద్యసేవకు దూరమవుతానన్న ఆలోచనతో.. వైద్యునిగానే కొనసాగారు. పదవీ విరమణ అనంతరం గ్రామాలకు వెళ్లి ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎల్లప్పుడూ సేవలు ఉచితమే. ఉచిత సేవతో కలిగే సంతృప్తి ముందు ఏదీ సమానం కాదంటారీయన. అందుకే.. డాక్టర్ కేవీ రామారావును జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సన్మానించింది.
ఆదర్శ వైద్యుడు.. సేవలో ప్రథముడు! - లయన్స్ క్లబ్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ డాక్టర్ కేవీ రామారావును సన్మానించింది. విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు గ్రామాలకు వెళ్లి ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు.
వైద్య వృత్తిలో ఉన్న చాలామంది సంపాదనే లక్ష్యంగా పని చేస్తారన్న అపోహ ప్రజల్లో ఉంది. అయితే.. అందరూ అలా కాదని తామూ ఆదర్శవంతమైన సేవలు చేయగలమని విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు నిరూపిస్తున్నారు. 1961లో శ్రీకాకుళం పెద్దాసుపత్రిలో వైద్యునిగా సేవలు ప్రారంభించిన ఆయన.. జిల్లాలోని సోంపేట, ఇచ్ఛాపురం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో పని చేశారు. ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పదేళ్లు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే.. డీఎం అండ్ హెచ్వోగా పదోన్నతి వచ్చినా.. వైద్యసేవకు దూరమవుతానన్న ఆలోచనతో.. వైద్యునిగానే కొనసాగారు. పదవీ విరమణ అనంతరం గ్రామాలకు వెళ్లి ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎల్లప్పుడూ సేవలు ఉచితమే. ఉచిత సేవతో కలిగే సంతృప్తి ముందు ఏదీ సమానం కాదంటారీయన. అందుకే.. డాక్టర్ కేవీ రామారావును జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సన్మానించింది.
Body:నూజివీడు త్రిబుల్ ఐటీ లోని శ్రీకాకుళం క్యాంపస్లో రిలే నిరాహార దీక్షలు
Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటి లోని శ్రీకాకుళం క్యాంపస్లో రిలే నిరాహార దీక్షలు