ఊరంతా చెత్త పేరుకుపోయి కంపుకొడుతోంది. దోమల వ్యాప్తితో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో స్పందించిన విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని వింటిపాలెం గ్రామానికి చెందిన యువత శ్రమదానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యువత, గ్రామస్థులు కలిసి ఊరంతా తిరిగి చెత్తను తొలగించి తగలబెట్టారు. మురుగు కాలువల్లో చెత్తను శుభ్రపరిచారు. చెత్తను పూర్తిగా తగలబెట్టడం వల్ల గ్రామమంతా పరిశుభ్రంగా మారింది. యువత చేసిన శ్రమదానానికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి...