విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారం గ్రామానికి చెందిన బోగాధి వెంకటేష్ మరో యువకుడు కలిసి ఆదివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న పెద్దేరు నదికి సరదాగా ఈతకు వెళ్లారు. నదిలో ఇద్దరూ ఈత కొడుతుండగా.. వెంకటేష్ ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామస్థులు ఎంత వెతికినా కనిపించలేదు. నది వద్దకు గ్రామస్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంకటేష్ మృతదేహం బయటకు తీశారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ సినిమాల నుంచి చెడునే స్వీకరించారు!