విశాఖ జిల్లా నాతవరం మండలం గన్నవరం పంచాయతీ పరిధిలోని వైబీ పట్నం వీఆర్వోను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
గ్రామానికి చెందిన పంచదార్ల చెల్లెమ్మ అనే వ్యక్తి నిర్మించుకున్న గోడను వీఆర్వో గణేష్.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ధ్వంసం చేశారని ఆరోపించారు. వృద్ధురాలు అని చూడకుండా తమ వారిపై దౌర్జన్యం చేశారన్నారు. తక్షణమే వీఆర్వోపై విచారణ చేపట్టిలని కోరారు.
ఇదీ చదవండి: