విశాఖపట్నం జిల్లా రోలుగుంట గ్రామానికి చెందిన వెంకటభవాని తరచూ కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో ఈరోజు కూడా కడుపునొప్పి రావడంతో... భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వెంకటభవాని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతురాలి తల్లి ముత్యాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: