విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళా ఖైదీలు విడుదలయ్యారు. జీఓ నెంబర్ 142 స్పెషల్ రెమిషన్ కింద ప్రభుత్వం వారికి ఈ అవకాశాన్ని కల్పించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గల్లేలా కాంతమ్మ, విశాఖకు చెందిన నీలపు రోజాలను జైలు అధికారులు విడుదల చేశారు. వీరికి జీవనోపాధి కల్పించేందుకు చినజీయర్ స్వామి ట్రస్టు ఇచ్చిన కుట్టుమిషన్లను జైలు సూపరిండెంట్ అందించారు. జీవనం సాగించేందుకు సహకారం అందించటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఆగస్టు 15న ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ రెమిషన్ కింద ఈ రోజు యాభై మూడు మంది ఖైదీలను విడుదల చేస్తున్నారు. విశాఖ జైలు నుంచి ఇద్దరు మహిళలను విడుదల చేశాం. జైలులో మహిళలకు బేకరీ పదార్థాల తయారీ, కుట్టు పనులు నేర్పించాం. ఈ పనులను వారు ఉపాధిగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో చినజీయర్ స్వామివారు కుట్టుమిషన్లను అందించారు. విడుదలైన ఖైదీలు మంచి జీవితాన్ని కొనసాగించాలని ఆంకాక్షిస్తున్నాం
- రాహుల్, జైలు సూపరిండెంట్.
జైలు అధికారులు మాకు పనులను, మంచి అలవాట్లను నేర్పించారు. బయటకు వెళ్లిన తర్వాత జీవనం సాగించేందుకు కుట్టుమిషన్లను అందించిన చినజీయర్ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు
-ఎన్.రోజా, విడుదలైన ఖైదీ.
నేను..భర్త, ఇద్దరు పిల్లలతో జైలుకు వచ్చాను. ఎంతో బాధలో ఉన్న మాకు జైలు అధికారులు ధైర్యం చెప్పారు. నా పిల్లలకు చదువు చెప్పించారు. వారిని ప్రత్యేక శ్రద్ధతో చూసుకున్నారు. వాళ్లు నేర్పిన పనులను చక్కగా నేర్చుకున్నాను. మమ్మల్ని విడుదల చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
-జి.కాంతమ్మ, విడుదలైన ఖైదీ.
ఇదీ చదవండి:
మంగళగిరి తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం... రూ.25వేల జరిమానా...