ETV Bharat / state

పాడేరులో కలకలం రేపిన మహిళ మరణం - విశాఖపట్నం జిల్లా నేరాలు

విశాఖపట్నం జిల్లా పాడేరులో మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరోనా వైరస్​తోనే ఆమె మరణించిందంటూ వదంతులు రాగా... అధికారులు రక్త నమూనాలు పరిశీలించి కొవిడ్ నెగటివ్​గా తేల్చారు. ఈ ఫలితాలతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Women Death With Unhealthy in paderu vizag district
పాడేరులో కలకలం రేపిన మహిళ మరణం
author img

By

Published : Jun 7, 2020, 3:36 PM IST

విశాఖపట్నం జిల్లా పాడేరులో ఓ మహిళ మృతి స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా కరోనా వైరస్​తోనే మృతురాలు చనిపోయిందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఏడీఎమ్ హెచ్ఓ లీలా ప్రసాద్​కు తెలియజేయగా.. మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఈ ఫలితాలలో కరోనా నెగటివ్ రావడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మృతురాలిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాసిగా గుర్తించారు.

ఇదీచదవండి.

లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.