ETV Bharat / state

కరోనాపై విశాఖ యంత్రాంగం అప్రమత్తం - విశాఖ తాజా వార్తలు

చైనాలో జీవం పోసుకున్న కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వారికి వైద్య సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు.

corona virus
corona virus
author img

By

Published : Jan 30, 2020, 7:35 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో... విశాఖ యంత్రాంగం అప్రమత్తం

ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ పై విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వైద్య సేవలకు ముందస్తుగా ఒక ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయంలో ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు... విదేశాలకు వెళ్లిన వారు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వారికీ వైద్య సేవలు అందించే ప్రణాళిక సిద్ధం చేశారు. దీని కోసం వాల్తేర్​లోని అంటువ్యాధులు నివారణ ఆసుపత్రిలో అదనంగా మరో పది పడకల వార్డు ఏర్పాటు చేశారు. పోర్టులకు ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన నౌకలు ఏమైనా ఉంటే వాటిని కూడా అప్రమత్తం చేసేందుకు సిద్ధం చేశారు. కరోనా వైరస్​పై చైతన్యం కల్పించడం, నివారణకు... జిల్లా వైద్య శాఖ, కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలలు సంయుక్తంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.

జర జాగ్రత్త!

జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణం.... ఈ వైరస్​కి అనుకూలమని చెప్తున్నారు. అదే విధంగా వ్యాధి లక్షణాల్లో ఏ ఒక్కటి గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. కొన్ని ఆహార నియమాలు పాటించి వ్యాయమం చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ లాంటివి దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.