ETV Bharat / state

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు.. డుడుమా జలాశయం నుంచి నీటి విడుదల

విశాఖపట్నంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు డుడుమా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి... వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

author img

By

Published : Jul 5, 2020, 11:36 PM IST

Water release from Duduma reservoir For  Heavy rain in Vishakha district
డుడుమా జలాశయం నుంచి నీటి విడుదల

విశాఖపట్నం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. 2 వేల 590 అడుగుల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 2 వేల 589.80 అడుగులకు చేరింది. ఫలితంగా జలాశయానికి చెందిన 8వ నంబర్ గేటు ఒక అడుగు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీచదవండి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.