విశాఖ జిల్లా చోడవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడం వల్ల పదివేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మోటార్లలో సాంకేతిక లోపం వల్లే సమస్య తలెత్తిందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. నియోజకవర్గంలో పది లక్షల లీటర్ల నీటిని అందించే ఏడు మంచినీటి పథకాలు ఉన్నాయి. నీటిని పంపింగ్ చేసేందుకు పెద్దేరు నది వద్ద పంప్‌హౌస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 5 హెచ్‌పీ మోటార్లు, రెండు, 20 హెచ్‌పీ మోటార్లు, రెండు, 30 హెచ్‌పీ మోటార్లు రెండు ఉన్నాయి. ఇవి పని చేసేందుకు సరిపడా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయలేదు. పంప్‌హౌస్ వద్ద 25 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీని స్థానంలో 100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులుండవని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: