విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో ఉన్న లైఫ్ లైన్ ఆగ్రో ఫుడ్ పరిశ్రమ ప్రభావంతో.. కాలుష్యం పెరిగి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని బాధితులు ఆవేదన చెందారు. తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామంటూ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదుచేశారు. పాండ్రంగిలో ఉన్న లైఫ్ లైన్ ఆగ్రో ఫుడ్- వాటర్ ప్లాంట్... ప్రారంభంలో 12 వేల లీటర్ల నీటిని మాత్రమే వాడుకోవాలన్న నిబంధన ఉండేదని గ్రామస్థులు గుర్తు చేశారు. ఇప్పుడా ఆ నీటి వాడకం 3 లక్షల లీటర్లకు పెరిగిందన్నారు.
వాటర్ ప్లాంట్ నిర్వాహకులు అధికంగా నీటికి వినియోగించడం వలన భూగర్భజలాలు తగ్గిపోయి తాగునీటి సమస్య తలెత్తిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశఆరు. ఈ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థజలాలు గోస్తనీ నదిలో కలవడం వలన నీటి కాలుష్యం జరుగుతుందోని ఆరోపించారు. 5 బోర్లు ద్వారా ప్లాంట్లో నీటిని తోడేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన చెందారు.
గ్రామం మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాల దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్లాంట్ను మూసివేసి, కాలుష్య అవస్థలు తప్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : 2007 నుంచి అదే పనిలో ఉన్నారు: అనిశా డీఎస్పీ