విశాఖలో ప్రతి రేషన్ కార్డుపై ఒక కిలో శనగలు, మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని.. అలాగే రూ.10కి అరకిలో పంచదార ఇవ్వాలని జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీని నివారించడానికి కార్డుదారుడు రావలసిన తేదీ, సమయం వివరాలతో కూపన్ ఇవ్వాలని సూచించారు.
నవశకం సర్వే తర్వాత జిల్లాలో 11,74,568 కుటుంబాలను అర్హులుగా గుర్తించి బియ్యం కార్డులు ఇచ్చినట్లు జేసీ తెలిపారు. ఇంకా 1,96,000 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని.. వీటిని మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలన్నారు. కొత్త కార్డులు, కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులపై 6 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిని పది రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు నిర్దేశించారు.
ఇదీ చదవండి..
వ్యవసాయ బడ్జెట్: కేటాయింపులు తగ్గినా...రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !