ETV Bharat / state

చెప్పుకోలేక.. విషవాయువు ప్రభావం తట్టుకోలేక..! - పశువలపై వైజాగ్ గ్యాస్ లీక్ ప్రభావం

విషవాయువును పీల్చిన కారణంగా.. కళ్లు తిరుగుతున్నాయ్... వాంతులు అవుతున్నాయి... తిండి సహించటం లేదు అని నోరున్న మనుషులు చెప్పుకోగులుగుతున్నారు. మరి... నోరు లేని మూగ జీవాల పరిస్థితి? వాటి ఆరోగ్య పరిస్థితి?

gas leak affect on buffalo
మూగజీవాలపై స్టైరీన్ గ్యాస్ ప్రభావం
author img

By

Published : May 25, 2020, 11:39 AM IST

మూగజీవాలపై స్టైరీన్ గ్యాస్ ప్రభావం

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజ్ ప్రభావం.. మూగ జీవాలపై తీవ్రంగా కనిపిస్తోంది. పెట్టిన గడ్డి తినక, నీరు ముట్టకుండా... నిలబడే ఓపిక లేక.. చాలా పశువులు కూలబడిపోతున్నాయి. ఘటన రోజు స్టైరిన్ వాయువు పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఆవులు కొన్నైతే, కొన ఊపిరితో కొట్టుమిట్టాడి చనిపోయినవి కొన్ని.

ఆ ఘటనలో విష వాయువు ఆవిరి ప్రభావానికి శరీరం కాలి.. ప్రాణాలతో బయటపడిన గేదెలు ఇప్పుడు పశుగ్రాసం ముట్టడం లేదు. మంచి నీరు సైతం తాగటం లేదని వాపోతున్నారు వాటి యజమానులు. వాటి బాధ చెప్పుకునేందుకు మాట రాదు కదా అని కన్నీటి పర్యంతం అవుతున్నారు వారు.

వరుస ఘటనలు జీర్ణించుకోలేకపోతున్న గోసంరక్షకులు

రాష్ట్రంలో వరుస గోవుల మరణాలను గో సంరక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణా జిల్లాలో గోవులు మృత్యువాత పడటం.. ఇప్పుడు ఎల్​జీ పాలిమర్స్​ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో విషవాయువు పీల్చి నురగలు కక్కుకుని మృతి చెందిన ఆవులను తలుచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం గో సంరక్షణకు ఉద్యమాలు చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు ఆ పనిని గాలికి వదిలేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు గో సంరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణం సీజ్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.