ETV Bharat / state

ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకురండి: ఎస్పీ - చింతపల్లిలో పర్యటించిన ఎస్పీ అట్టడా బాబుజీ

విశాఖపట్నం జిల్లా ఎస్పీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చింతపల్లిలో పర్యటించారు. గిరిజన గ్రామాల్లో లాక్​డౌన్ అమలుపై ఆరా తీశారు. ప్రజలుకు ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

vishaka sp inspection in chintapalli
చింతపల్లిలో పర్యటించిన ఎస్పీ అట్టడా బాబుజీ
author img

By

Published : Apr 25, 2020, 10:56 AM IST

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో జిల్లా ఎస్పీ అట్టడా బాబుజీ పర్యటించారు. మన్యంలో లాక్​డౌన్​ అమలవుతున్న తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లాక్​డౌన్​కు గిరిజనులు సహకరిస్తున్నారు..
గిరిజన ప్రాంత ప్రజలందరూ లాక్​డౌన్​కు ఎంతో సహకరిస్తున్నారని ఎస్పీ తెలిపారు. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

మావోయిస్టుల రాకను నిరాకరిస్తున్నారు...
జీసీసీ ద్వారా ప్రతి గ్రామానికి రేషన్ అందిస్తున్నట్లు బాబుజీ వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల గిరిజనులు మావోయిస్టుల రాకను నిరాకరిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్య సమస్యలపై పోరాడుతున్నారన్నారు.

వలస కూలీలను ఆదుకుంటున్నాం..
విశాఖలో 10 వేల మందికి పైగా వలస కూలీలు ఉన్నారనీ, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి: పాడేరులో ఒడిశా మద్యం పట్టివేత: ముగ్గురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.