కరోనా బారిన పడి ఈ నెల 28న మృత్యువాత పడిన విశాఖకు చెందిన వైద్య విద్యార్థికి పలువురు నివాళులర్పించారు. విశాఖ జిల్లా గవర కంచరపాలెంకు చెందిన ఈ యువకుడు వైద్య విద్యను అభ్యసిస్తూ కరోనా సేవల నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా నెల్లూరులో ఉంటున్నాడు. కరోనాతో చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో అతని స్నేహితులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ గ్రామస్థులు కొవ్వొతులతో నివాళులర్పించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ