చేయీచేయీ కలిపారు.. వందల సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా జరగని పనిని.. తామే పూర్తి చేసుకునేందుకు సంకల్పించారు. ఏళ్ల తరబడి రహదారి లేక పడుతున్న ఇబ్బందికి ముగింపు పలకాలని నడుం బిగించారు. రోడ్డు నిర్మాణానికి ముందుకు కదిలారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయితీ పరిధిలో ఉన్న కర్కపల్లి, తాటి దవులు, గడ్డి బంధ గ్రామాల ప్రజలు.. ఓపిక నశించి.. శ్రమదానానికి ముందుకు వచ్చారు.
ఇన్నాళ్లూ.. రోడ్డు సౌకర్యం లేక.. వాహనాల రాకపోకలు సలువుగా జరగక.. గర్భిణులను డోలీ సాయంతో ఆస్పత్రులకు మోసుకువెళ్లాల్సిన విషమ పరిస్థితులను ఇక భరించలేమన్న నిర్ణయానికి వచ్చారు. అంతా ఒక్కటై.. రహదారి నిర్మాణానికి నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పనులు మొదలుపెట్టారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: