పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే నీటి కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించడంపై విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటయితే , ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితం అవుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు వాటర్ వర్క్స్ స్థలాన్ని పరిరక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి: వి.మాడుగుల తహసీల్దార్ కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం