విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో.. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఎత్తైన భవనాలపై భారీ లౌడ్స్పీకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ సూచనలు వినిపించేలా మైక్‌లతో అవగాహన కలిగిస్తున్నారు. ఈ స్పీకర్ల పనితీరును నగర కమిషనర్ ఆర్.కె.మీనా పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: