దసరా, దీపావళి పండుగల సమయంలో.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. 'కొవిడ్-19 ఎప్రాప్రియేట్ బిహేవియర్' పేరిట బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వివిధ దుకాణాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు ధరించేలా చూడాలన్నారు. వ్యాపార ప్రదేశాల్లో యజమానులే సొంతగా వైరస్ నివారణపై బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో విస్తృతంగా కొవిడ్ నివారణపై ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మసీదులు, చర్చ్‌లు, దేవాలయాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని హోర్డింగ్‌లన్నీ 10 రోజుల పాటు వైరస్ నివారణ ప్రచారానికే వినియోగించాలని తెలిపారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.
ఇదీ చదవండి: