విశాఖ రెవెన్యూ డివిజన్‌లో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లోని 103 సర్పంచ్, 904 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 103 పంచాయతీల్లో 279 మంది సర్పంచ్ అభ్యర్ధులు బరిలో నిలవగా.. 904 వార్డుల్లో 1965 మంది పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 1068 పోలింగ్ స్టేషన్లలో.. 2,28,879 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 68 సమస్యాత్మక పంచాయతీల్లో అధికారులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నమోదైన ఓటింగ్ శాతం..
పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు తొందరగా వెలువడేలా సిబ్బంది శ్రమించారు. విశాఖ జిల్లాలో 86.94 శాతం వోటింగ్ నమోదైంది. ఆనందపురంలో 88.80%, భీమునిపట్నంలో 84.09%, పద్మనాభంలో 86.81%, పరవాడలో 82.94%, పెందుర్తిలో 90.69%, సబ్బవరంలో 88.3౦% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో మొదటి విడతలో 84.23 శాతం, రెండవ విడతలో 84.06 శాతం, మూడవ విడతలో 69.38 శాతం, నాల్గో విడతలో 86.94 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగు విడతల్లో కలిసి విశాఖ జిల్లాలో సగటున 81.15 ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై జిల్లా ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.