నూతన సంవత్సర వేడుకలకు విశాఖ బీచ్ రోడ్లో ప్రజలకు అనుమతి లేదని, అందరూ సహకరించాలని, చట్టవ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. 2019-20 వార్షిక నివేదికను వెల్లడించిన సీపీ మనీష్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు హోటల్స్ కు ఎటువంటి అనుమతి లేదన్నారు.
కొత్త వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో 'బయటకు వస్తే పోతాం... ఇంట్లో ఉండి వేడుక చేసుకుందాం' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది క్రైం రేటు 14 శాతం తగ్గిందని.. నగర పరిధిలో బైక్ రేసింగ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ రవాణాకు విశాఖ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో.. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకునేందుకు 'విన్' ( విమెన్ నీడ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సైబర్ క్రైమ్ నేరాల అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఇదీ చదవండి:
15 రోజుల్లో మరోసారి భేటీ... పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్ణయం