ETV Bharat / state

జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై.. అధికారులతో కలెక్టర్​ సమీక్ష

author img

By

Published : Feb 24, 2021, 4:10 AM IST

రానున్న జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్​ వినయ్​ చంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు జీవీఎంసీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

visaka collector on municipal elections
జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్​ సమీక్ష

గ్రేటర్​ విశాఖ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీవీఎంసీ) ఎన్నికల కోసం అధికారులు 1,712 పోలింగు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందితో జీవీఎంసీ కార్యాలయంలో సమావేశమైన కలెక్టర్ వినయ్​ చంద్​.. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడంపై సూచనలు చేశారు.

ఓటర్లకు ఫోటో కలిగి ఉన్న ఓటర్​ స్లిప్పులను ఇంటింటికీ అందించాలని కలెక్టర్​ సూచించారు. అధికారులందరూ బాధ్యతతో, సమష్టి కృషితో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఒక్కొక్క జోనల్ కమిషనర్​కు, డిప్యూటీ కలెక్టర్​ను నిర్వహణకు కేటాయిస్తామన్నారు. తమకు విజ్ఞప్తి చేసిన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు జీవీఎంసీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్​ లేదా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ ఫిర్యాదులను అందించవచ్చని కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన నంబర్లు...

ప్రధాన కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ : 1800 4250 0009.

ల్యాండ్ లైన్ నెంబర్ : 0891-2869122; 0891- 2869123.

ఇదీ చదవండి:

మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విస్తృత ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.