విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రాజానగరం గ్రామస్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆక్వా చెరువుల నుంచి విడుదలవుతున్న వ్యర్ధాల కారణంగా తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో గ్రామస్థులు కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. తక్షణమే అధికారులు చెరువును తొలగించి, తాగునీటి వనరులను కాపాడాలని డిమాండ్ చేశారు. వీరికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా ఫ్యాక్టరీ వాళ్లకే ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...