అక్క అంటే ఆ తమ్ముడికి ఎనలేని మమకారం. పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తనదిగా భావించి.. నిరంతరం వారి ఉన్నతి కోసం తపన పడేవాడు. చివరికి రాఖీ పండుగ రోజే అక్క అనారోగ్యంతో మృతి చెందటంతో.. తట్టుకోలేక తమ్ముడు కూడా గుండెపోటుతో మరణించాడు. విశాఖ జిల్లా అనకాపల్లి శారదా కాలనీకి చెందిన లోలలితాదేవి.. కుమారై పద్మినీ రాణితో పాటు ఆమె తమ్ముడు ఎన్ఆర్ఎస్ రామచంద్రరాజు కలిసి నివసిస్తున్నారు. నిన్న లలితా దేవి(84)అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చాక రామచంద్రరాజు(76) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాసేపటికి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. రాఖీ పౌర్ణమి నాడు.. ఆ అక్క,తమ్ముల మరణం చూపరులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండీ.. Capital Amaravathi ISSUE: రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ.. నవంబరు 15కి వాయిదా