విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పెదబయలు మండలం చుట్టుమెట్ట తోటల మలుపుల వద్ద ప్రమాదం జరిగింది. పాడేరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు.
ఫలితంగా ఈ మార్గంలో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకరమైన మలుపు వెడల్పు తక్కువగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: