విశాఖ కంచరపాలెం సమీపంలోని ఊర్వశి కూడలి వద్దనున్న ఎస్బీఐలో చోరీ చేసేందుకు ఇద్దరు దొంగలు యత్నించారు. తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు కిటికీ తొలగించి లోపలకి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాలు, బ్యాంకు సర్వర్ వైర్లను తొలగించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో బ్యాంకులోని క్యాష్ క్యాబిన్ అద్దం విరగ్గొట్టి గాలించారు. ఎక్కడా ఏదీ లభించకపోవడంతో లోపలి నుంచి పక్కనున్న ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడా ఏమీ దొరక్క పోవడంతో తాము వచ్చిన కిటికీలోంచే మళ్లీ పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఇదీ చదవండీ..: నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు