ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ప్రాంతంలో... వైద్య సేవలను ప్రైవేట్‌పరం చేయడంపై గిరిజనులు ఆందోళన చేశారు. అధికారులతో ఆందోళనకారుల చర్చలు విఫలం కావడంతో... జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం గేట్లు మూసేశారు. ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడంతో... ప్రతీ గంటకు 90 మెగావాట్ల ఉత్పత్తి నష్టం జరిగింది. రాత్రి వరకు చర్చలు జరిపితే... ప్రైవేటు సంస్థ వారు సీటీ స్కాన్, ఎక్స్‌రే వంటి అత్యాధునిక వసతులను సమకూర్చి ప్రారంభించాలని కోరారు. వైద్య సేవలు అందని కారణంగా... 2 నెలల వ్యవధిలో ఆరుగురు గిరిజనులు మృతిచెందారని వారికి... పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనికి ఒప్పకోకపోవడంతో... గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇదీచూడండి.తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం...