విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారిపై అర్థరాత్రి ఓ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నాడు. వేగంగా వచ్చే వాహనదారులు అతన్ని గమనించి అకస్మాత్తుగా వాహనాలను నియంత్రించలేక ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం కావటంతో రాత్రి సమయంలోనూ భారీ వాహనాల రద్దీ ఉంటుంది. ఈ సంఘటన పోలీస్‌స్టేషన్‌కు అడుగుల దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు కూడా పరిస్థితిని గమనించలేకపోయారు.
ఇదీ చదవండి: ములాఖత్’లకు మోక్షమెప్పుడో!