కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. సెప్టెంబర్ 5 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం సరైనది కాదని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ అన్నారు. విద్యా శాఖ మంత్రికే కరోనా నుంచి రక్షణ లేదని, ఈ సమయంలో పాఠశాలలు తెరిచి.. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
చరవాణి, కంప్యూటర్లు, లాప్టాప్లు లేక చాలామంది ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే పరిస్థితి లేనందున... తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయాలని కోరారు. పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే... విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: