ETV Bharat / state

ఇదో కొత్త రకం మత్తు దందా.. విశాఖలో జోరుగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకం - అక్రమంగా పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అమ్మకం

Illegally selling of pentazocine lactate injections: విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పశ్చిమబంగా నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిఘా పెట్టిన వారు.. ముగ్గురు నిందితలను అరెస్టు చేశారు.

three arrested for selling pentazocine lactate injections illegally in visakhapatnam
విశాఖలో జోరుగా పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అమ్మకం.. ముగ్గురు అరెస్టు
author img

By

Published : May 9, 2022, 10:28 AM IST

Updated : May 9, 2022, 1:01 PM IST

Illegally selling of pentazocine lactate injections: శస్త్రచికిత్సల్లో నొప్పిని నివారించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న నిందితులను.. విశాఖ టాస్కుఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 వేల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖరగ్​పూర్‌లో ఒక బాక్సు ఇంజెక్షన్లు రూ.1300కు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో రూ.2వేలకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

విశాఖలో విద్యార్థులు, యువత మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల దందా సాగుతోందని.. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టినట్లు చెప్పారు.

పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన అనుపమ అధికారి, కౌశిక్ చౌధురి అనే ఇద్దరితోపాటు.. భీమిలిలో ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 3 వేల ఇంజెక్షన్లు, రూ.వెయ్యి నగదు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : May 9, 2022, 1:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.