విశాఖ జిల్లా అనకాపల్లిలో.. అందంగా లేనని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయరామరాజు పేటకు చెందిన సాయికృష్ణ(21)...తన అందాన్ని మెరుగుపరచుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు. దీని కోసం రూ.2లక్షల ఇవ్వాలని కుటుంబసభ్యులను అడిగాడు. వారు అంత మెుత్తం ఇవ్వలేమని చెప్పారు. అయితే వారి నుంచి 60 వేల రూపాయలను తీసుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అయినప్పటికీ ముఖంపై మెుటిమలు రావటం, లావు పెరగటం, ఆస్థమా ఉండటంతో...తీవ్ర ఆత్మనూన్యతకు లోనైన ఆ యువకుడు ఇంటి మేడ మీద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: