భీమిలి నియోజకవర్గంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో రెండో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకంలో భాగంగా జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి తెలిపారు. గత ఏడాది 3, 91, 100 మంది తల్లులు లబ్ది పొందగా ఈ ఏడాది అదనంగా మరో 1,9,004 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది 615 కోట్లు ఆయా ఖాతాల్లో జమ కానున్నట్లు వెల్లడించారు.
ప్రతి తల్లి ఖాతాలో గత ఏడాది 15 వేల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ కాగా.. ఈసారి 14000 జమ అవుతాయని మిగిలిన వేయి రూపాయలు టాయిలెట్ల నిర్వహణ కమిటీ ఖాతాలో జమ అవుతాయని వివరించారు. ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందని విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ , ఐటిఐ లాంటి టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదన్నారు. వారంతా జగన్ అన్న విద్య దీవెన పథకంలో చేరుతారని డీఈవో లింగేశ్వర రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి...