విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల ఏలేరు కాలువలో ఇవాంజల్ స్టీఫెన్ కింగ్ అనే బాలుడు గల్లంతయ్యాడనే అనుమానంతో... పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ వద్ద బాలుడి చెప్పులు కనిపించగా.. సైకిల్ తొక్కుతూ... ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చూడండి: