Tension at Gangavaram Port in Visakhapatnam : విశాఖ గంగవరం పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాలంటూ... కార్మిక సంఘం నేతలు పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. పోర్టు వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు యత్నించగా... తీవ్ర తోపులాట జరిగింది. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారు ప్రతిఘటించడంతో... ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల్లో వారిని తరలించారు.
విశాఖపట్నంలోని గంగవరం పోర్టు వద్ద పరిస్థితి రణరంగంగా మారింది. పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 36వేలు చెల్లించాలని.. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ... కార్మిక సంఘం నేతలు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోర్టు వద్ద అధికారులు భారీగా బలగాలను మోహరించారు. ఒక్కసారిగా పోర్టు ప్రధాన ద్వారం వద్దకు కార్మికులు, కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Gajuwaka Police పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. వారు ప్రతిఘటించడంతో పరిస్థితి తీవ్ర రూపుదాల్చింది. తోపులాటలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. గాజువాక సీఐ కాల్లోకి ముళ్ల కంచె దిగగా.. ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకు గాయాలయ్యాయి. దాదాపు 10మంది తోపులాటలో గాయపడారు. ఆందోళనకారులకు మద్దతుగా బంద్ లో అఖిలపక్ష నాయకులు(All party leaders) పెద్దఎత్తున పాల్గొన్నారు. పోర్టు వల్ల కాలుష్యం పెరిగిపోతోందని నేతలు మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అఖిలపక్షం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను వాహనాల్లోకి ఎక్కించిన పోలీసులు.. పోర్టు ప్రధాన గేటు వద్ద నుంచి వారిని తరలించారు.
గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారు: రామకృష్ణ
Labor demand డిమాండ్లు పరిష్కరించాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు.. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీలకతీతంగా కుటుంబాలతో తరలివచ్చారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని కార్మికుల డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు(Visakha Port) ప్రధాన ద్వారం వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు.. కంచెను దాటుకుని కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా.. పోలీసులు, కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని తరలించారు. గంగవరం పోర్టు బంద్‌కు కార్మిక సంఘాల పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు గేట్‌కు 100 మీటర్ల దూరంలో మరో గేటు వద్దే అడ్డుకునేలా.. ఇరువైపులా భారీ కంచె ఏర్పాటు చేశారు.
బంద్ విరమించిన కార్మికులు.. కార్మికుల డిమాండ్లపై పోర్టు యాజమాన్యంతో ఆర్డీఓ చర్చలు జరిపారు. వారి డిమాండ్లలో కొన్నింటిని యాజమాన్యం ఆమోదించిందని.... మిగిలిన వాటికి గడువు అడిగినట్లు ఆయన తెలిపారు. పోర్టు యాజమాన్యం తీరు మోసపూరితంగా ఉందని ఆందోళనకారులు చెప్తున్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెబుతూ బంద్‌ను విరమించారు.
Vizag port: విశాఖలో పోర్టు కార్మికుల ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్