విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. మన్యం వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు తొలగడం లేదు. బుధవారం ఉదయం లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లిలో 4.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవటంతో మంచు వర్షంలా కురుస్తోంది.
పిల్లలు, గర్భిణులు, వృద్ధులు చలి, మంచులో బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యటకులూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: