Achchennaidu Is Comments on CM Jagan: మీడియా కథనాలపై తిట్టాలంటూ కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశంపై.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ చెప్పే అబద్దాలను ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చెప్పినట్టే మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. జగన్ అబద్దాలకోరని కలెక్టర్లు చెప్పాలని అన్నారు. పెన్షన్ల విషయంలో వాస్తవాలను కలెక్టర్లు.. ప్రజలకు వివరించాలని కోరారు.
కలెక్టర్లు వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తేనే జగన్‌కు బుద్ది వస్తుందన్నారు. " సంక్షేమం " అనే పదం పుట్టిందే..ఎన్టీఆర్ నుంచి అని పేర్కొన్నారు. పెన్షన్.. పెన్షన్ అని జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు.. పెన్షన్ విధానాన్ని ప్రవేశపెటిందే.. ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ను 3 వేల రూపాయలకు పెంచుతామన్న జగన్ ..ఆ మాటను పక్కన పెట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇవీ చదవండి: