విశాఖ జిల్లాలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తానని.. తెలుగుదేశం ఎమ్మెల్సీ పి. చలపతిరావు చెప్పారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినా.. అధికారులు ఆహ్వానించడం లేదని ఆరోపించారు.
ఎలమంచిలిలో పక్కా గృహాల పంపిణీలో పేదలకు అన్యాయం జరిగిందన్న ఆయన.. లబ్ధిదారుల జాబితాను మార్చేసి వైకాపా కార్యకర్తలకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తామని.. చలపతిరావు తెలిపారు.
ఇదీ చదవండి: