ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు: బొండా ఉమా - జగన్ పైవ్యాఖ్యలుచేసిన సీపీఐ రామకృష్ణ

TDP Leader Bonda Uma Comments On CM Jagan : ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా టీడీపీ నేత బొండా ఉమా జగన్ మోహన్ రెడ్డిపై పలు వ్యాఖ్యాలు చేశారు. గతంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జగన్​పై పలు ఆరోపణలు చేశారు.

bonda uma
bonda uma
author img

By

Published : Mar 2, 2023, 3:37 PM IST

TDP Leader Bonda Uma Comments On CM Jagan : ఈ నెల 13వ తేదిన జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి లేదని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో బొండా ఉమా మాట్లాడారు. అసలు శాసన మండలి వద్దని చెప్పినవారు ఏం మొహం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని, ఉత్తరాంధ్రకు ఏం చేశారని బొండా ఉమా ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రకు ఏ ప్రాజెక్ట్ తెచ్చారు : చివరికి పరిశ్రమలో, విద్యాలయాలలో బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా మారారని అన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స నారాయణ విశాఖను రాజధాని చేస్తున్నామని, కనుక వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని అడుగుతున్నారని, ఉత్తరాంధ్రకు ఏ ప్రాజెక్ట్ తెచ్చారో చెప్పాలని అన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సు అని డ్రామా కంపెనీ పెడుతున్నారని, ఉన్న పరిశ్రమలను పంపించి.. 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి లేద: బొండా ఉమా

"శాసన మండలి అనవసరం అని శాసన సభలో తీర్మానం చేశాడు. శాసన మండలిని రద్దు చేసి మాట తిప్పను మడప తిప్పను అని చెప్పి మాట తప్పాడు మడమ తిప్పాడు. జగన్​కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక రకాలుగా అభ్యర్ధలను భయపెడుతున్నాడు. విశాఖపట్నంలో అయితే దుర్మార్గం ఫ్యాక్టరీలకు వెళ్లి, కంపెనీలకు వెళ్లి, ఎడ్యుకేషన్ ఇన్టిట్యూషన్​కి వెళ్లి మీరు ఓటు వేయకపోతే తాళాలు వేస్తాం. మూసేస్తాం. ఇష్టారీతినా విశాఖపట్నంలో ఎన్నో రకాలుగా పట్ట భద్రుల్ని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ జగన్ రెడ్డి.. వై నాట్ 175 అంటున్నావ్. ఉత్తరాంధ్రాకి ఐకానిక్​గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్​, ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి అయిపోయాడు. " - బొండా ఉమా, టీడీపీ నేత

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేకనే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ చేశారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, జగన్ మోహన్ రెడ్డికి తన అభ్యర్థులపై నమ్మకం లేకనే అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవం చేసుకున్నారని రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మారు వేషాల్లో వెళ్లి నామినేషన్లు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే ఏర్పడిందని అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపేవారు కాదని, అందుకు భిన్నంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.