ETV Bharat / state

సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనుమానాలు.. సజ్జల డైరెక్షన్​లోనే వ్యవహారం: బండారు

ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన వెంటనే అనంతబాబును ఎందుకు పట్టుకోలేదని పోలీసులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్​లోనే ఈ వ్యవహరమంతా నడుస్తోందని ఆరోపించారు.

సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనుమానాలు
సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనుమానాలు
author img

By

Published : May 23, 2022, 6:38 PM IST

ముఖ్యమంత్రి జగన్ పాలనలో హత్య చేసిన వ్యక్తే.. మృతుడి కుటుంబానికి శవాన్ని అప్పగించే పరిస్థితి ఏర్పడిందని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన వెంటనే అనంతబాబును ఎందుకు పట్టుకోలేదని పోలీసులను ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాలో దళితుడిని పాశవికంగా హత్య చేస్తే.. కారెం శివాజీ, జూపూడి ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్​లోనే ఈ వ్యవహరమంతా నడుస్తోందన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న జగన్.. ఏం మాట్లాడలేని ఓ మహిళను హోమంత్రిగా చేసి సజ్జలతో నాటకం నడిపిస్తున్నారని విమర్శించారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ....ఈనెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్‌ ఫోన్‌ చేసి ...నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చారు.

సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.