విశాఖ ద్వారకానగర్‌లోని హోటల్ కాంప్లెక్స్‌లో పాన్‌మసాలా, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచారనే సమాచారంతో...టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఆర్‌జీ ఫుడ్ ఇండస్ట్రీ భవనంలో రాంగోపాల్ అనే వ్యక్తి కొంత కాలంగా ఈ సరకును నిల్వ చేస్తున్నాడు. కాన్పూర్ నుంచి నగరానికి తీసుకువచ్చి.. ఇక్కడనుంచి వరంగల్, కర్నాటక ప్రాంతాలకు తరలిస్తున్నాడని ఏసీపీ మూర్తి తెలిపారు. అతని వద్ద దాదాపు రూ.5.53 లక్షల విలువ చేసే సరకు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి ఫుడ్ ఇండస్ట్రీ సూపర్‌వైజర్ కోరాడ నర్సింగరావును అదుపులోకి తీసుకున్నారు
ఇదీ చదవండీ...'జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేవు.. మోదీకి మాత్రం'