సేవా సంస్థలు ముందుకొచ్చి నిరుపేద మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు సహకారాలు అందించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖకు చెందిన సిరియాజి చారిటబుల్ ట్రస్టు.. నాలుగు కుట్టు మిషన్లను సమకూర్చింది. వీటిని మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన నలుగురు పేద మహిళలకు ఆయన చేతుల మీదుగా అందించారు.
స్థానిక పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో పొలినాయుడు, తహసీల్దార్ సత్యనారాయణ, వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరియాజి చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి: