విశాఖ స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పరిశ్రమ భూములను పాస్కో అనే సంస్థకు భాగస్వామ్యం పేరిట ధారాదత్తం చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చెందుతుండగా... వారితో, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో మంత్రి భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తే అడ్డుకుని తీరతామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కొత్త స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకై పాస్కో సంస్థతో భాగస్వామ్యం గురించి కేంద్రం ముందు ప్రతిపాదన వచ్చిందే తప్ప... ప్రస్తుతమున్న పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేదేమీ లేదని విశాఖ ఉక్కు సీఎండీ పీకే రథ్ స్పష్టం చేశారు.
ఇదీచదవండి