ETV Bharat / state

State Bandh for Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, కడప ఉక్కు పరిశ్రమ సాధనకు నవంబర్​ 8న బంద్‌ - విశాఖ ఉక్కు కర్మాగారం

State Bandh for Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన నిరసనలు వెయ్యి రోజులకు చేరుతున్న వేళ.. వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పోరు ఉద్ధృతం చేశాయి. స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం.. వచ్చే నెల 8న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు నేతలు ప్రకటించారు.

State Bandh for Vizag Steel Plant
State Bandh for Vizag Steel Plant
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 10:49 AM IST

State Bandh for Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, కడప ఉక్కు పరిశ్రమ సాధనకు నవంబర్​ 8న బంద్‌

State Bandh for Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విశాఖలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు బంద్ వివరాలను తెలియజేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా విద్యార్థి సంఘాలు బంద్ చేయాలని నిశ్చయించాయని వివరించారు. అదే విధంగా కడప ఉక్కు కర్మాగారం ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని నాగరాజు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం మూడు లక్షల కోట్ల విలువైన ఆస్తిని కేవలం 30 వేల కోట్లకు అదానీకి విక్రయించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vizag Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

రాష్ట్రంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే వీలు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలు చేపడుతున్న విద్యాసంస్థల బంద్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం రాజశేఖర్ రెడ్డి గతంలోనే శంకుస్థాపన చేస్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మరోసారి శంకుస్థాపన చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపనలు చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది కానీ, పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినా కడప ఉక్కు పరిశ్రమను తీసుకురావడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు.

visakha steel : ప్రభుత్వమే నిర్వహించాలి.. ప్రైవేటుకు అప్పగిస్తే ఆందోళన తప్పదు : కార్మికులు

ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రయత్నించటం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా యువత తీవ్రంగా నష్టపోతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు, కడప ఉక్కు పరిశ్రమల సాధన కోసం నవంబర్ 8వ తేదీన నిర్వహించనున్న బంద్​లో ఏఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్​ఓ తదితర విద్యార్థి యువజన సంఘాలు భాగస్వాములు కానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారు ఈ బంద్​కు స్వచ్ఛందంగా సహకరించాలని.. జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై నోరువిప్పని సీఎం జగన్.. కేంద్ర పెద్దల వద్ద మౌనంగా వైసీపీ ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.