International Chess Player Meenakshi: విశాఖకు చెందిన డాక్టర్ అపర్ణ, మధు దంపతుల కూతురు అలన మీనాక్షి. చిన్నప్పటి నుంచి మేథోపరమైన ఆటల్లో మీనాక్షికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అందులో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చదువులో వెనకబడకుండా జాగ్రత్త తీసుకుంటూనే... చదరంగంలోనూ వివిధ టోర్నీల్లో పాల్గొంది మీనాక్షి. ఆ కృషి ఫలితమే.. జాతీయస్థాయిలో మూడుసార్లు పదేళ్ల లోపు బాలికల విభాగంలో పతకాలు వరించాయి. ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ సాధించడంతో.. మీనాక్షి, ఫిడే ప్రమాణాల ప్రకారం అండర్-10లో ప్రపంచంలోనే రెండో ర్యాంకుకి ఎగబాకింది.
2018లో ఆసియా స్కూల్స్ అండర్-7 బాలికల విభాగంలో.. మీనాక్షి బంగారు పతకం సాధించింది. 2019లో ఆసియా యూత్ అండర్-8లో ర్యాపిడ్ గోల్డ్, వెస్ట్రన్ ఏషియన్ అండర్-8లో ర్యాపిడ్ గోల్డ్, బ్లిట్జ్ గోల్డ్, క్లాసిక్ బ్రాంజ్ పతకాలను సాధించింది. రాష్ట్రానికి సంబంధించిన టోర్నీల్లో అండర్-7 విభాగంలో ఛాంఫియన్ షిప్ టైటిల్, అండర్-9 కేటగిరిలో వెండి పతకం సాధించింది. 2020లో అండర్-9 బాలికల విభాగంలో ఛాంపియన్ కాగా.. 2021లో అండర్-12 కేటగిరిలో వెండి పతకం, అండర్-10 విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెడతానని మీనాక్షి చెబుతోంది.
చిన్న వయసులో తమ కూతురు.. అంతర్జాతీయ స్థాయిలో టీమ్ ఛాంపియన్ షిప్ గెలవటంలో కీలక పాత్ర పోషించటం సంతోషంగా ఉందని మీనాక్షి తల్లి అపర్ణ తెలిపారు. మీనాక్షికి ఒకసారి ఏదైనా మెళకువ చెబితే దానిని సమయానుకూలంగా ప్రయోగించి.. ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని కోచ్ చిరంజీవి చెబుతున్నారు. తమ కూతురు మరిన్ని విజయాలు సాధించి.. వరల్డ్ ఛాంపియన్‌గా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:
పిల్లలతో బాక్సులు మోయించిన వాచ్మెన్.. చూసినా పట్టించుకోని పోలీసులు!